AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో మరో కొత్త వైరస్.. 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన కోట్లాది మంది నానావస్థతలు పడుతున్నారు. దాదాపు లక్షలాది వైరస్ కాటుకు బలయ్యారు. తాజాగా మరో వైరస్ పొంచి ఉందని చైనా అధికారులు వెల్లడించారు.

చైనాలో మరో కొత్త వైరస్.. 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్
Balaraju Goud
|

Updated on: Nov 06, 2020 | 5:48 PM

Share

ప్రపంచానికి మాయదారి రోగాన్ని అంటగట్టిన డ్రాగన్ కంట్రీ.. మరో మహమ్మారిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన కోట్లాది మంది నానావస్థతలు పడుతున్నారు. దాదాపు లక్షలాది వైరస్ కాటుకు బలయ్యారు. తాజాగా మరో వైరస్ పొంచి ఉందని చైనా అధికారులు వెల్లడించారు.

చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మరో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది. ఆ దేశంలోని గన్సు ప్రావిన్సు లాన్ జౌలో 6 వేల మందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా పాజిటివ్ అని తేలిందని చైనా అధికారులు వెల్లడించారు. లాన్ జౌలో గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ కు పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గన్స్ ప్రావిన్సులోని లాన్ జౌ నగరంలో పశువుల ద్వారా ఈ వైరస్ వ్యాపించి బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రబలుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దీని బారినపడినవారి సంఖ్య 6,620 మందికి చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల, కలుషితమైన జంతుఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెలోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. చైనాలోని పశుసంవర్ధకశాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని లాన్ జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. దీంతో స్థానిక ప్రజలను చైనా అధికారులు అప్రమత్తం చేశారు. ఇది ఇతరులకు వ్యాపించడానికి గల కారణాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

Follow Us
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు