AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టును తప్పుదోవ పట్టించారు.. మోహన్ బాబు ప్రకటన

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు జరిమానాతో పాటు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది ఎర్రమంజిల్ కోర్టు. 2010 నుంచి ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. అయితే వెంటనే మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు మోహన్ బాబు. ‘‘2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు […]

కోర్టును తప్పుదోవ పట్టించారు.. మోహన్ బాబు ప్రకటన
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 02, 2019 | 4:45 PM

Share

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు జరిమానాతో పాటు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది ఎర్రమంజిల్ కోర్టు. 2010 నుంచి ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. అయితే వెంటనే మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు మోహన్ బాబు.

‘‘2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించేశాం. మా బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40లక్షల చెక్ ఇచ్చాం. సలీమ్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో వైవీఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం. సినిమా చేయడం లేదని వైవీఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంక్‌లో వేయొద్దని కూడా చెప్పాం. అయినా కూడా కావాలనే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి, కోర్టును తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని ఛానల్స్‌లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మొద్దు’’ అంటూ మోహన్ బాబు అన్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి