తమిళనాడులో పూర్వ వైభవం తీసుకువస్తాం.. కోయంబత్తూరు రోడ్ షోలో రాహుల్ గాంధీ

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో రోడ్‌షో నిర్వహించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ.

తమిళనాడులో పూర్వ వైభవం తీసుకువస్తాం.. కోయంబత్తూరు రోడ్ షోలో రాహుల్ గాంధీ
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 23, 2021 | 5:30 PM

Rahul tamilnadu tour : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కోయంబత్తూర్‌లో రోడ్‌షో నిర్వహించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. తమిళ ప్రజలపై , తమిళ సంస్కృతిపై ప్రధాని మోదీకి గౌరవం లేదని విమర్శించారు రాహుల్‌. ఒకే భాష , ఒకే సంస్కృతిని తెచ్చే ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని ఆరోపించరాఉ. కాంగ్రెస్‌ పార్టీ తమిళ సంస్కృతిని కాపాడడానికి రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రాహుల్‌గాంధీ. తమిళంతో పాటు హిందీ , బెంగాలీ , ఇంగ్లీష్‌ భాషలను తమ పార్టీ గౌరవిస్తుందన్నారు. అన్ని భాషలను సమదృష్టితో చూస్తామన్నారు.

తమిళ నాడుకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను అండగా నిలుస్తానని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవలేదని ప్రపంచానికి మరోసారి తాము చాటుతామని పేర్కొన్నారు. తమిళనాడుతో తనకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. ఈ బంధం రాజకీయాలకు అతీతమైనదని, కుంటుంబ బాంధవ్యమని అన్నారు. రాహుల్ గాందీ మూడు రోజుల పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. రాహుల్ రాష్ట్రంలో పర్యటించడం గత నెలరోజుల్లో ఇది రెండోసారి.