రాహుల్‌ను తప్పుపట్టిన మోడీ

ఢిల్లీ: యాంటీ శాటిలైట్‌ క్షిపణిని ప్రయోగించడంలో భారత్‌ సాధించిన ఘనతపై రాహుల్‌ స్పందించిన తీరును ప్రధాని మోడీ తప్పుబట్టారు. కొంతమందికి సినిమా థియేటర్‌లోని సెట్‌కి, అంతరిక్షంలోని శాట్‌కి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఏ-శాట్‌ క్షిపణిని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన అనంతరం మోడీ మాట్లాడిన కాసేపటికి ‘డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోడీకి హ్యాపీ వరల్డ్‌ థియేటర్‌ డే అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దీనికి కౌంటర్‌గానే మోడీ స్పందించారు. గరీబీ హఠావో […]

రాహుల్‌ను తప్పుపట్టిన మోడీ
Follow us

|

Updated on: Mar 29, 2019 | 7:45 PM

ఢిల్లీ: యాంటీ శాటిలైట్‌ క్షిపణిని ప్రయోగించడంలో భారత్‌ సాధించిన ఘనతపై రాహుల్‌ స్పందించిన తీరును ప్రధాని మోడీ తప్పుబట్టారు. కొంతమందికి సినిమా థియేటర్‌లోని సెట్‌కి, అంతరిక్షంలోని శాట్‌కి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఏ-శాట్‌ క్షిపణిని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన అనంతరం మోడీ మాట్లాడిన కాసేపటికి ‘డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోడీకి హ్యాపీ వరల్డ్‌ థియేటర్‌ డే అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దీనికి కౌంటర్‌గానే మోడీ స్పందించారు.

గరీబీ హఠావో నినాదంపై కూడా ప్రధాని స్పందించారు. తనకు ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పటి నుంచీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ పేదరికాన్ని నిర్మూలిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చాయని మోడీ అన్నారు. కాని నేటికీ పేదరికం మన కళ్ల ముందు కనబడుతూనే ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ను పూర్తిగా దేశం నుంచి వెళ్లగొడితేనే పేదరికం నిర్మూలించగలమని మోడీ అన్నారు.