వివేకా హత్య కేసుపై పోలీసులు ప్రెస్ నోట్

వివేకా హత్య కేసుపై పోలీసులు ప్రెస్ నోట్

కడప: వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో.. హత్య జరిగిన స్థలంలోనే వివేకా మృతదేహానికి దుస్తులు మార్చారని, గాయాలకు కట్లు కట్టారని పోలీసులు తెలిపారు. దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచేశారు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి చెప్పినట్టుగా పనిమనిషి లక్ష్మీ కుమారుడు ప్రకాశ్ రక్తాన్ని తుడిచేశాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి వాళ్లే మార్చురీకి తరలించారు. ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఇలా చేయమని వారిని ఎవరు ప్రోత్సహించారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని […]

Vijay K

|

Mar 28, 2019 | 8:32 PM

కడప: వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో.. హత్య జరిగిన స్థలంలోనే వివేకా మృతదేహానికి దుస్తులు మార్చారని, గాయాలకు కట్లు కట్టారని పోలీసులు తెలిపారు. దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచేశారు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి చెప్పినట్టుగా పనిమనిషి లక్ష్మీ కుమారుడు ప్రకాశ్ రక్తాన్ని తుడిచేశాడు. మృతదేహాన్ని అక్కడి నుంచి వాళ్లే మార్చురీకి తరలించారు. ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఇలా చేయమని వారిని ఎవరు ప్రోత్సహించారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు ప్రెస్ నోట్‌లో తెలిపారు.

వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగానే కడప జిల్లా పోలీసులు ఈ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu