పాటలీపుత్రంలో పరిమళించిన కమలం

బీహార్‌లో బీజేపీ మ్యాజిక్ చేసింది. ఈసారి బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో పలు మార్లు చోటుచేసుకున్నాయి.

పాటలీపుత్రంలో పరిమళించిన కమలం
Follow us

|

Updated on: Nov 10, 2020 | 6:25 PM

బీహార్‌లో బీజేపీ మ్యాజిక్ చేసింది. ఈసారి బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో పలు మార్లు చోటుచేసుకున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడికి నిదర్శనంగా నిలిచింది. ఆర్జేడీ, జేడీయూ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జతకడితే.. ఈసారి జేడీయూ ఎన్డీయేలో చేరిపోయింది. దీంతో పెద్దగా ఆశలు పెట్టుకోని స్టేట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది కమలం. బీహార్‌లో బీజేపీ జోరు వెనక మోదీ వేవ్‌ ఉందంటున్నారు విశ్లేషకులు.

కరోనా కాలంలో.. ఆర్థిక పరిస్థితులు నెమ్మదించిన సమయంలో బీహార్‌ లాంటి రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించడం ఆ పార్టీకి బిగ్ రిలీఫ్ అంటున్నారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 స్థానాలు థర్డ్ ప్లేస్‌లో ఉన్న బీజేపీ ఈ సారి ఏకంగా 70 స్థానాలతో టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. అదే సమయంలో మిత్ర పక్షం జేడీయూ దాదాపు 20 స్థానాలు కోల్పోయింది. అంటే బీహారీలు 15 ఏళ్లు పాలించిన నితీష్‌ కంటే ఈ సారి బీజేపీనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఈ సారి ఎన్నికల్లో బాగా పనిచేసిందని నమ్ముతున్నాయి పార్టీ శ్రేణులు.

నరేంద్ర మోదీ ఇప్పటికీ బీహార్‌లో పాపులర్‌. కానీ అసెంబ్లీ ఎన్నికలంటే రాష్ట్ర పాలకులకు పరీక్ష. మొదట్లో విజయంపై నితీష్‌ ధీమాగా కనిపించినప్పటికీ తర్వాతర్వాత అంచనాలు మారిపోయాయి. నితీష్‌ పై విపరీతమైన వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేల్చిచెప్పాయి. ఇలాంటి సమయంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా అన్నీ తానై రంగంలోకి దిగారు ప్రధాని నరేంద్ర మోదీ. సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. నితీష్‌పై ఉన్న అసంతృప్తిని ఎన్డీయేపై పడకుండా చూడగలిగారు. ఓ రకంగా కూటమికి భారంగా ఉన్న నితీష్‌ను.. ఎన్డీయేని మోదీనే కాపాడారనేది పరిశీలకుల అంచనా. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపించడం ఖాయమని… పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన బీహారీలు తిరిగి రాష్ట్రం చేరుకోడానికి ఇబ్బందులు పడ్డారని.. ఎన్డీయే ఓటమి ఖాయమని లెక్కలు వేశాయి ప్రతిపక్షాలు. కానీ మోదీ మాత్రం తాము ప్రకటించిన ప్యాకేజీలు.. చేసిన ఏర్పాట్లను ప్రస్తావించి ఎన్నికల ప్రచారం చేశారు.

అలాగే, అయోధ్య, ఆర్టికల్ 370, CAA ఇలా అన్ని అంశాల్ని ప్రస్తావించి కాంగ్రెస్‌ ఆర్జేడీకు ఊపిరాడకుండా చేశారు మోదీ. శతాబ్ధాల తపస్సు తర్వాత చివరకు అయోధ్యలో గొప్ప రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని అయోధ్య టాపిక్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. మందిర నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారని ఎద్దేవా చేసిన ప్రతిపక్షాలే.. ఇప్పుడు మమ్మల్ని ఈ విషయంలో ప్రశంసించాల్సిన పరిస్థితికి వచ్చాయని.. సీత జన్మస్థలమైన మిథిలాతో పాటు అయోధ్య వైపు కూడా ఆనందంగా చూస్తుందంటూ కామెంట్ చేశారు. ఇక భారత్ మాతాకీ జై.. జై శ్రీరాం అనలేని వాళ్లతో బీహారీలకు ఇబ్బంది కలుగుతుందని.. కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో వంద సీట్లు కూడా లేవని.. ఆ పార్టీ తరఫున కనీసం వంద మంది ఎంపీలను కూడా ప్రజలు లోక్‌సభకు పంపలేదని ఎద్దేవా చేయడం.. తేజస్వి యాదవ్‌ కుర్తా పట్టుకోని వేలాడుతూ గెలవాలనుకుంటున్నారని ఇలా నాన్‌స్టాఫ్‌ కామెంట్లతో మహాఘట్‌ బంధన్‌ కూటమిని టార్గెట్ చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసింది. కానీ తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే తిరిగి తీసుకొస్తామని వ్యాఖ్యానించడం దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దులకు పంపే బీహార్‌ లాంటి రాష్ట్రానికి ఇది అవమానం కాదా అంటూ ప్రశ్నించి దేశభక్తిని టచ్‌ చేశారు. మన నిర్ణయాలను పాకిస్థాన్‌ మంత్రులే వాళ్ల శాసనసభల్లో ప్రస్తావించి భయపడితే.. ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నాయని.. దేశభక్తి లేని ఇలాంటి వారికి ఓటేస్తారా అంటూ బీహార్‌ ఓటర్లను ప్రశ్నించి మరీ తన పార్టీ వైపుకు తిప్పుకొన్నారు మోదీ. CAA వచ్చినప్పుడు ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేస్తారని ప్రతిపక్షాలు అబద్ధాన్ని ప్రచారం చేశాయ్‌. ఏడాది గడిచిపోయింది. ఏ భారతీయుడైనా తన పౌరసత్వాన్ని కోల్పోయారా అని ప్రశ్నించి వారి మద్దతును పొంది.. తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు బీహారీల చేత ఆమోదం వేయించుకొన్నారు మోదీ.

సర్వేల్లో తనకు వ్యతిరేకంగా అభిప్రాయాలు రావడంతో నితీష్‌ కూడా పూర్తిగా మోదీపై డిపెండ్ అయ్యారు. గతంలో బీహార్‌కు మోదీ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోని నితీష్‌ ఈ ఎన్నికల్లో మాత్రం మోదీ పాల్గొన్న ప్రతి మీటింగ్‌కు హజరయ్యారు. తనని సపోర్ట్ చేస్తూనే.. అయోధ్య లాంటి విషయంలో చురకలు అంటించినా సైలెంట్‌గా ఉండిపోయారు నితీష్‌. ఇక ఎన్డీయే ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్‌తో పోల్చుతూ, ప్రతిపక్షాల కూటమిలో డబుల్ డబుల్ యువరాజులు ఉన్నారంటూ చేసిన ప్రచారం బాగా కలిసొచ్చింది. అంతేకాకుండా ప్రాంతీయ అభివృద్ధిని ఫోకస్ చేస్తూ ప్రచారం సాగింది. ముఖ్యంగా ప్రధాని ఎన్డీయే కూటమికి మద్దతుగా 12 ర్యాలీల్లో ప్రచారం చేశారు. ప్రధాని ప్రచారం నిర్వహించిన ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం.

అలాగే బీజేపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టడంపై రకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయ్‌. కేంద్రంలో మరో మూడున్నరేళ్లకు పైగా బీజేపీనే అధికారంలో ఉంటుంది. అంటే బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. బీహార్ అభివృద్ధికి ఛాన్సెస్‌ ఉంటాయని నమ్మి బీజేపీని అధిక స్థానాల్లో గెలిపించారని చెబుతున్నారు. ఓవరాల్‌గా ఏ ఆశలు లేని సమయంలో బీహార్‌లో ఈ రకంగా పుంజుకోవడం బీజేపీకి ఊహించని బలానిచ్చేదే. తర్వాత ఎలక్షన్స్‌కు వెళ్లే పశ్చిమబెంగాల్‌లో మరింత ఉత్సాహంగా పని చేయడానికి బీహార్‌ ఫలితాలు బూస్ట్ ఇచ్చినట్టే అంటున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..