అక్షయ్ కుమార్ ఖాతాలో మరో రికార్డు.. 150 కోట్ల క్లబ్‌లో “మిషన్ మంగళ్”

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అక్షయ్ కుమార్ సినిమా మిషన్ మంగళ్ 11 రోజుల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరి.. విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ విషయాన్ని సినీ విళ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ కుమార్ రెండో సినిమాగా మిషన్ మంగళ్ నిలిచింది. ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 164 కోట్లు రాబట్టింది. […]

అక్షయ్ కుమార్ ఖాతాలో మరో రికార్డు.. 150 కోట్ల క్లబ్‌లో మిషన్ మంగళ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 26, 2019 | 4:40 PM

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అక్షయ్ కుమార్ సినిమా మిషన్ మంగళ్ 11 రోజుల్లోనే 150 కోట్ల క్లబ్‌లో చేరి.. విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ విషయాన్ని సినీ విళ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ కుమార్ రెండో సినిమాగా మిషన్ మంగళ్ నిలిచింది. ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 164 కోట్లు రాబట్టింది. అక్షయ్‌తో పాటు విద్యాబాలన్, సోనాక్షి సిన్హ, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్ ఈ చిత్రంలో నటించారు. ఇక అక్షయ్ మొదటి చిత్రం రజనీకాంత్‌తో చేసిన 2.0 పది రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది.