ఎంపీ ఇంటిపై బాంబు దాడి… అది పేలక పోవడంతో తప్పిన ప్రమాదం…ప్రత్యర్ధుల దాడిగా అనుమానం

ఏడాది ముందే తమిళనాడులో రాజకీయం రక్తి కడుతోంది. ఓ వైపు పొత్తులు.. మరో వైపు కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా ఓ ఎంపీ ఇంటిపైనే నాటు బాంబుతో దాడి చేశారు ప్రత్యర్ధులు. అయితే అది పేలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఎంపీ ఇంటిపై బాంబు దాడి... అది పేలక పోవడంతో తప్పిన ప్రమాదం...ప్రత్యర్ధుల దాడిగా అనుమానం
Follow us

|

Updated on: Nov 25, 2020 | 8:44 AM

ఏడాది ముందే తమిళనాడులో రాజకీయం రక్తి కడుతోంది. ఓ వైపు పొత్తులు.. మరో వైపు కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా ఓ ఎంపీ ఇంటిపైనే నాటు బాంబుతో దాడి చేశారు ప్రత్యర్ధులు. అయితే అది పేలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్‌ కుటుంబీకులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడి చేశారు. అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లోని కలెక్టరేట్‌ సమీపంలో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు విజయకుమార్‌ నివాసం ఉంది. ప్రతిరోజూ ఉదయం  ఆయన ఇంటి నుంచి కారులో బయటకు వచ్చి, సమీపంలోని స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో వాకింగ్‌ చేస్తాంటారు. దీనిని పరిగణలోకి తీసుకుని గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి వ్యూహ ప్లాన్ చేశారు.

మంగళవారం ఉదయాన్నే ఆయన కారుపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు పేల లేదు. ఇంటివద్దకు వచ్చిన కారు డ్రైవర్‌ బాంబును గుర్తించి, ఇంట్లో ఉన్న ఎంపీ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్‌ బృందం రంగంలోకి దిగింది. ఎంపీ ఇంట్లో ఉన్నట్టుగా ఆగుర్తుతెలియని వ్యక్తులు భావించినట్టున్నారు.

అయితే ఎంపీ విజయ కుమార్ తన కారును ఇంటి వద్దే వదలి ఢిల్లీకి బయలు దేరి వెళ్లడంతో ఈ గండం నుంచి బయటపడ్డారు. ఒక వేళ ఆ బాంబు పేలివుంటే కారు, ఆ పరిసరాలు కొన్ని మీటర్ల దూరం మేరకు దెబ్బతిని ఉండేది అని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయితే ఇది రాజకీయ ప్రత్యర్ధుల దాడిగానే అన్నా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.

Latest Articles
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
నార్త్ మేరీల్యాండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి,
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
60 ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర ఎంతో తెల్సా..?
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు
వామ్మో..మంత్రి పనిమనిషిఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..రూ.30కోట్లు
బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు
బాలయ్య చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేసి హిట్ కొట్టేశాడు