AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

January 30th Martyr’s Day: ఈనెల 30న జాతీయ అమరవీరుల సంస్మరణదినం.. దేశప్రజలందరూ 2 ని. మౌనం పాటించాలని కేంద్రం పిలుపు

భరతమాత విముక్తి కోసం.. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థం జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న...

January 30th Martyr's Day: ఈనెల 30న జాతీయ అమరవీరుల సంస్మరణదినం.. దేశప్రజలందరూ 2 ని. మౌనం పాటించాలని కేంద్రం పిలుపు
Surya Kala
| Edited By: |

Updated on: Jan 20, 2021 | 5:02 PM

Share

January 30th Martyr’s Day: భరతమాత విముక్తి కోసం.. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ఆ త్యాగమూర్తుల జ్ఞాపకార్థం జాతిపిత గాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న అమరవీరుల సంస్మరణదినంగా జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 30న దేశ ప్రజలందరూ 2 నిముషాలు మౌనం పాటించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఓ లేఖను రాసింది. ప్రతి ఏడాది జనవరి 30న దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని జనవరి 18న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. భారతదేశ స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

జనవరి 30 న ఉదయం 11 గంటలకు దేశమంతటా శ్రద్దాంజలి ఘటించాలని కేంద్ర తెలిపింది. ఇందులో భాగంగా ప్రారంభానికి .. ముగింపుకి గుర్తుగా స్థానికంగా అందుబాటులో ఉన్న సైరెన్, తుపాకుల శబ్దం, గంటను మోగించడం వంటివి శబ్దాలు చేయాలని తెలిపింది. “సైరన్‌లను 10.59 గంటల నుండి 11.00 గంటల వరకు వినిపించాలని రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతరం మళ్లీ సైరన్‌లను 11.02 గంటల నుండి 11.03 గంటల వరకు వినిపించాలని .. అందుబాటులో ఉన్న శబ్ధాలతో ఈ విధానాన్ని అవలంబించవచ్చునని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇలా శబ్దాలతో సిగ్నల్ ఇవ్వడానికి అందుబాటులో లేని ప్రదేశాల్లో ఉదయం 11గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించడానికి అనుగుణంగా సంబంధిత వారందరికీ తగిన సూచనలు ఇవ్వమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అమరవీరుల దినోత్సవాలన్ని మన అమరవీరులను తలచుకునే విధంగా చూడాలని అదేశించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సూచనలు జారీ చేయమని కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమ చేపట్టాలని సూచించింది.

Also Read: రాముడు పుట్టిన భూమిలో జన్మించాం.. మందిర నిర్మాణం కోసం విరాళమిద్దాంమంటున్న ముస్లిం మహిళ