అడిషనల్‌ డీజీపీకి బీజేపీ అభ్యర్థన పత్రం.. డీజీపీ సవాంగ్‌కు ఇచ్చిన డెడ్‌లైనే కారణమా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలకు నిరసనగా ఆ రాష్ట్ర బీజేపీ దేవాలయాల పరిరక్షణ యాత్రకు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 4:19 pm, Wed, 20 January 21
అడిషనల్‌ డీజీపీకి బీజేపీ అభ్యర్థన పత్రం.. డీజీపీ సవాంగ్‌కు ఇచ్చిన డెడ్‌లైనే కారణమా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలకు నిరసనగా ఆ రాష్ట్ర బీజేపీ దేవాలయాల పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కపిల తీర్థం టు రామతీర్థం వయా శ్రీశైలం యాత్ర చేయాలని ఆ పార్టీ ప్లాన్‌ సిద్ధం చేసింది.

బీజేపీ తలపెట్టిన ఆలయాల యాత్రకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు అ పార్టీ నేతలు. విష్ణువర్ధన్ రెడ్డితో కూడిన బీజేపీ బృందం అడిషనల్ డిజిపి ఏ. రవిశంకర్ తో భేటీ అయ్యారు. యాత్రకు అనుమతి ఇవ్వావలంటూ అభ్యర్ధన పత్రాన్ని అందించారు.

అయితే తొలుత డీజీపీ సవాంగ్‌కు అభ్యర్థన పత్రాన్ని ఇవ్వాలని ఆ పార్టీ భావించింది. ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ నేతలున్నారన్న డీజపీ ప్రకటనతో ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో అప్పటి వరకు వైసీపీ వర్సెస్‌ బీజేపీగా నడిచిన పొలిటికల్‌ వార్‌ బీజీపీ వర్సెస్‌ డీజీపీగా మారింది. డీజీపీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డెడ్‌లైన్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు డీజీపీని కాకుండా అడిషనల్‌ డీజీపీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.