AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓపెన్‌ నాలాలపైకప్పు నిర్మాణం చేపట్టండి: కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలోని ఓపెన్‌ నాలాలపై క్యాపింగ్‌ (బాక్స్‌ డ్రైనేజీలు) నిర్మాణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఓపెన్‌ నాలాలపైకప్పు నిర్మాణం చేపట్టండి: కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Sep 21, 2020 | 7:21 PM

Share

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీ. రామారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని ఓపెన్‌ నాలాలపై క్యాపింగ్‌ (బాక్స్‌ డ్రైనేజీలు) నిర్మాణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేయాలని.. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్యాపింగ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.300కోట్లు ఖర్చు అవుతాయని.. వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాళాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Follow Us
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌