AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కొనసాగుతున్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సినేషన్.. టీకా తీసుకుని అస్వస్థతకు గురైన మహిళా డాక్టర్

అమెరికాలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళ డాక్టర్‌కు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు.

అమెరికాలో కొనసాగుతున్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సినేషన్.. టీకా తీసుకుని అస్వస్థతకు గురైన మహిళా డాక్టర్
Covid-19 Vaccine
Balaraju Goud
|

Updated on: Jan 03, 2021 | 7:33 AM

Share

కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కొనసాగుతుంది. ఇందులో భాగంగా అమెరికాలో ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అస్వస్థతకు గురైంది. మహిళా డాక్టర్ కేసును తాము అధ్యయనం చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న మహిళ డాక్టర్‌కు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆమెలో మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు రావడంతో న్యూవో లియోన్‌లోని ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ‘ఎన్సెఫలోమైలిటిస్’తో వైద్యురాలు బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఎన్సెఫలోమైలిటిస్’ అనేది మెదడు, వెన్నుపాము వాపుకు సంబంధించి సమస్యలని వైద్య నిపుణులు తెలిపారు. డాక్టర్‌కు అలర్జీ ప్రతిచర్యల చరిత్ర ఉందని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెదడువాపును పరీక్షించారని క్లినికల్ ట్రయల్స్ నుంచి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, దీనిపై ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థ స్పందించలేదు. మెక్సికోలో కరోనా మహమ్మారికి 1,26,500 మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల దేశంలో అత్యవసర వినియోగానికి అమెరికా, జపాన్‌ దిగ్గజాలు ఫైజర్‌ పేరుతో తీసుకువచ్చిన కొవిడ్‌ టీకాకు ఆమోదముద్ర వేసింది.

Follow Us