AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్‌లో వాల్ పోస్టర్ కలకలం.. సీఎం అమరీందర్ సింగ్‌ను చంపితే కానుక అంటూ ప్రకటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా పోస్టర్‌ను అంటించాడు.

పంజాబ్‌లో వాల్ పోస్టర్ కలకలం.. సీఎం అమరీందర్ సింగ్‌ను చంపితే కానుక అంటూ ప్రకటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Balaraju Goud
|

Updated on: Jan 03, 2021 | 7:00 AM

Share

Death threat to Punjab CM: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను చంపుతామంటూ వెలిసిన వాల్ పోస్టర్ ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఎం అమరీందర్‌ సింగ్‌ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా పోస్టర్‌ను అంటించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో పోస్టర్‌ దర్శనమిచ్చింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను చంపితే రూ.10 లక్షలు ఇస్తారని ఓ పోస్టర్‌ వెలసింది. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన ఓ ఈమెయిల్‌ ఐడీని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్‌ను ఎవరు అంటించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామని త్వరలో నిందితులను పట్టుకుంటామని పంజాబ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

Follow Us