AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామతీర్థం ఆలయ వివాదంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ధర్మకర్త హోదా నుంచి అశోక్‌గజపతిరాజు తొలగింపు

ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై వేటు పడింది.

రామతీర్థం ఆలయ వివాదంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ధర్మకర్త హోదా నుంచి అశోక్‌గజపతిరాజు తొలగింపు
Balaraju Goud
|

Updated on: Jan 03, 2021 | 6:41 AM

Share

రామతీర్థం ఆలయ వివాదంతో రాజకీయాలు హీటెక్కాయి. ఓ వైపు విగ్రహాల ధ్వంసంపై ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తుండగా, మరోవైపు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై వేటు పడింది. అంతేకాదు రామతీర్థ ఆలయంతో పాటు మరో మూడు ఆలయాల చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జీఓ.65ను శనివారం విడుదల చేసింది. ఇప్పటికే సింహాచలం వరహాలక్ష్మీనరసింహ స్వామి అలయం, మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ పదవుల నుంచి అశోక్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం, రామతీర్థం ఆలయం, తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి మందేశ్వర స్వామి ఆలయం చైర్మన్‌ పదవుల నుంచి కూడా అశోక్‌గజపతిరాజును తొలగిస్తూ దేవదాయ శాఖ అదేశాలిచ్చింది. ఆలయ నిర్వహణలో విఫలమయ్యారని ఆయనను ధర్మకర్త మండలి హోదా నుంచి తొలగిస్తూ ఏపీ దేవాదాయశాఖ వెల్లడించింది.

Follow Us