AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soldier Dead: అమరుడైన తెలుగు జవాన్… జమ్మూ కశ్మీర్‌లో ఘటన… చలి తీవ్రతతో అస్వస్థత….

జమ్మూకశ్మీర్‌లో తెలుగు ఆర్మీజవాన్‌ అమరుడయ్యాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..

Soldier Dead: అమరుడైన తెలుగు జవాన్... జమ్మూ కశ్మీర్‌లో ఘటన... చలి తీవ్రతతో అస్వస్థత....
boy was hanged by the door curtain
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 03, 2021 | 5:41 AM

Share

జమ్మూకశ్మీర్‌లో తెలుగు ఆర్మీజవాన్‌ అమరుడయ్యాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగా చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో సహచర జవానులు గుర్తించి సపర్యలు చేసి వెంటనే హెలికాప్టర్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రెడ్డప్పనాయుడు మృతి చెందాడని ఆర్మీ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఈ విషయాన్ని జవాను కుటుంబీకులకు చేరవేశారు. రెడ్డప్ప నాయుడు మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న తన కుమారుడు విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెడ్డప్ప భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:  కోల్ కతాలో నగర నడిబొడ్డున బాంబుల కలకలం, స్వాధీనం చేసుకున్న పోలీసులు, మమతా బెనర్జీ ప్రభుత్వం సీరియస్