Budha Gochar: 2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..
ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక జరగనుంది. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కలవడంతో కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం సొంతం అవుతుంది. ఈ సమయంలో చాలా రాశుల వారు ధనవంతులు అవుతారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. మొత్తం 12 రాశులు బుధ గ్రహ సంచారం వలన ప్రభావితమవుతాయి. బుధుడు తన రాశిని 2025 సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో మార్చుకోబోతున్నాడు. బుధగ్రహం ఈ రాశి మార్పు కొత్త సంవత్సరం మొదటి వారంలోనే జరుగుతుంది. అంటే 2025 జనవరి 4న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.
ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కలయిక సంవత్సరంలోని మొదటి నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకుని రానున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు ఆర్ధికంగా బలపడతారు. ధనవంతులు అవుతారు. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: మేష రాశి వారికి బుధుడు రాశిని మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బుధుడు మేషరాశిలోని 9వ ఇంటిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారు తమ తండ్రి సహకారంతో గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ కాలంలో మేష రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా పెరుగుదల ఉంటుంది. కెరీర్లో కూడా విజయావకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
మిధున రాశి: బుధుడు రాశిని మార్చుకున్న తరువాత బుధుడు మిథున రాశి వారికి ఏడవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కారణంగా.. మిథునరాశి వారు ఈ కాలంలో విశేష ఫలితాలను పొందనున్నారు. ఈ సమయంలో మిథున రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో సీనియర్ల సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాల్లో తలెత్తే సమస్యలు ఈ కాలంలో ముగుస్తాయి.
సింహ రాశి: రాశి మార్పు తరువాత.. బుధుడు సింహరాశి వ్యక్తుల ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ కాలంలో సింహ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి.
ధనుస్సు రాశి: బుధుడు తన రాశిని మార్చుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ధనుస్సు రాశిలోని లగ్న గృహంలో సంచరిస్తాడు. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం వీరి వెంటనే ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ పూర్తి మద్దతును పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తులు వ్యాపారంలో, కుటుంబంలో మద్దతును పొందుతారు. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.