అందాల పోటీలో ఊర్వశిని వరించిన టైటిల్స్ ఇవే..
25 December
2024
Battula Prudvi
25 ఫిబ్రవరి 1994న హరిద్వార్‌లో జన్మించింది ఊర్వశి రౌటేలా. కోట్‌ద్వార్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో, ఢిల్లీలోని గార్గ కళాశాలలో చదువుకుంది.
15 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ లో తన కెరీర్ ను మొదలుపెట్టింది. కొన్ని యాడ్స్ లో కూడా నటించింది ఈ వయ్యారి.
2009లో మిస్ టీన్ ఇండియా అందాల పోటీల్లో తలిసారి పాల్గొని టైటిల్ విన్నర్ గా నిలిచింది ఈ అందాల నెరజాణ.
2011 సంవత్సరంలో ఇండియన్ ప్రిన్సెస్ 2011, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011 టైటిల్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్‌ను గెలుచుకుంది. ఇది మొదటి భారతీయ మహిళగా నిలిచింది.
2015లో ఘనంగా జరిగిన మిస్ దివా-మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీల్లో కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ బ్యూటీ.
2012లో I AM She – Miss Universe India కిరీటంతోపాటు మిస్ ఫోటోజెనిక్ ప్రత్యేక అవార్డును గెలుచుకుంది ఈ బ్యూటీ.
తర్వాత మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నర్ గా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ ప్లాన్.. పుష్పరాజ్ సక్సెస్ దారిలో..
పుష్ప రూట్ లోనే గేమ్ చెంజర్.. హిట్ కోసం పక్క ప్లాన్..
నిను మరిపిస్తానే మాయేదో పన్ని అంటున్న బాలయ్య..