నిను మరిపిస్తానే మాయేదో పన్ని అంటున్న బాలయ్య.. 

24 December 2024

Battula Prudvi

2025 సంక్రాంతికి ‘డాకు మహారాజ్‌’గా ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు.

బాలయ్య టైటిల్‌ పాత్రలో నటించిన ఈ యాక్షన్ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‎లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలు.

యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇప్పటీకే విడుదలైన ఈ చిత్రం టీజర్ వీక్షకులను గూస్ బంప్స్ తెప్పించింది. దీనికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇటీవల రిలీజ్ అయినా ది రేజ్ ఆఫ్ డాకు టైటిల్ సాంగ్‎లో ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇదిలా ఉంటె తాజగా సోమవారం ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసారు మేకర్స్. ఇది బాలయ్యకు.. ఓ చిన్నారికి మధ్య సాగుతుంది.

‘‘చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ.. నిను మరిపిస్తానే మాయేదో పన్ని’’ అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకుల మనసుకి హత్తుకుంది.