క్యూట్ క్యూట్ చిన్నది.. నవ్వుతోనే కవ్విస్తున్నది.. 

25 December 2024

Rajeev 

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. అందం అభినయం ఉన్నా అవకాశాలు అందుకోలేకపోతుంది.

కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. కానీ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈషా రెబ్బ.

ఈ బ్యూటీ చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. స్పెషల్ రోల్స్ లో నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది.

త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కొంచం బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. ఈ చిన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా క్రిస్మస్ సందర్భంగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.