5

ట్రంప్ కు దూరంగా నడుస్తూ, సోల్జర్ చేతిని పట్టుకుని మెలనియా ! ‘డైవోర్స్’ రూమర్స్ నిజమేనా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఆయన భార్య మెలనియా డైవోర్స్ ఇవ్వవచ్చునన్న ఊహాగానాలు రేగుతున్న తరుణంలో..

ట్రంప్ కు దూరంగా నడుస్తూ, సోల్జర్ చేతిని పట్టుకుని మెలనియా ! 'డైవోర్స్' రూమర్స్ నిజమేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2020 | 8:03 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఆయన భార్య మెలనియా డైవోర్స్ ఇవ్వవచ్చునన్న ఊహాగానాలు రేగుతున్న తరుణంలో..ఇందుకు రుజువుగానా అన్నట్టు కళ్లెదుట ఓ దృశ్యం కనబడింది. ఆర్లింగ్టన్ లో బుధవారం అమరవీరులకు నివాళులు అర్పించేందుకు నేషనల్ సిమెటరీకి చేరుకున్న ట్రంప్, మెలనియా దూర దూరంగా నడిచారు. (విదేశాలకు ఇద్దరూ ఎప్పుడు కలిసి వెళ్లినా కొత్త దంపతుల్లా చేతిలో చెయ్యి వేసుకుని నడిచేవారు). ఇక అర్లింగ్టన్ విషయానికి వస్తే మెలనియా.. ట్రంప్ చేతిని కాకుండా ..భయస్తురాలిలా ఓ సోల్జర్ (సైనికుడి) చేతిని పట్టుకుని నడిచింది.  ఇది మరీ విడ్డూరంగా కనిపించింది. వైట్ హౌస్ ను ట్రంప్ వీడగానే మెలనియా ఆయనకు విడాకులు ఇవ్వవచ్ఛునని ట్రంప్ మాజీ సహచరురాలు ఓమరోసా న్యూమన్ ఈ మధ్యే రూమర్స్ ని స్ప్రెడ్ చేసింది. ఇందుకోసం ఆమె నిముషాలు లెక్కపెట్టుకుంటోందని కూడా ఓమరోసా మరో షాకింగ్ రూమర్ ను వదిలింది. ఇక గత నెలలో ఓ  రాష్ట్రంలో డిబేట్ ముగుస్తుండగా మెలనమ్మ తన భర్తకు దూరంగా విసవిసా స్టేజీ దిగి కిందికి వచ్చిన విషయాన్ని కొందరు ‘సూక్ష్మ గ్రాహులు’ గమనించారు.