తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఇవే…

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో  సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు, వాయు కాలుష్య నియంత్రణ భక్తుల బాధ్యత అని...

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఇవే...
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2020 | 8:34 PM

Mandatory For Vehicles Traveling : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో  సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు, వాయు కాలుష్య నియంత్రణ భక్తుల బాధ్యత అని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య అన్నారు. అలిపిరిలో రవాణాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి వాహనాలను తనిఖీలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి సొంత వాహనాలపై వచ్చే భక్తులకు కనుమ రహదారిపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఏఎస్పీ వెల్లడించారు.

పది సంవత్సరాలకు పైబడిన వాహనాలు కనుమ రహదారిలో ప్రయాణించాలంటే వాటి సామర్థ్యం తప్పని సరి అని. సామర్థ్య, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలకు అన్ని పత్రాలు సరిచూసుకుని రావాలని రవాణాశాఖ అధికారి సీతారామిరెడ్డి సూచించారు.