డొనాల్డ్ ట్రంప్ కు మెలనియా విడాకులిస్తారా ?

అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఆయన భార్య మెలనియా విడాకులిస్తారా ? వైట్ హౌస్ ను వీడగానే ఆయనకు ఆమె డైవోర్స్ ఇస్తారని, ఇందుకు నిముషాలు లెక్కపెట్టుకుంటున్నారని వీరి మాజీ అడ్మినిస్ట్రేషన్ సహచరులు చెబుతున్నారంటూ డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెలనియాకు మాజీ సీనియర్ అడ్వైజర్ అయిన  స్టెఫానీ వోకాఫ్  ఈ షాకింగ్ సమాచారాన్ని తెలియజేసినట్టు ఈ కథనం పేర్కొంది. వైట్ హౌస్ లో ట్రంప్, మెలనియాలకు వేర్వేరు బెడ్ రూమ్స్ ఉన్నాయని, వారి […]

డొనాల్డ్ ట్రంప్ కు మెలనియా విడాకులిస్తారా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 08, 2020 | 6:13 PM

అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఆయన భార్య మెలనియా విడాకులిస్తారా ? వైట్ హౌస్ ను వీడగానే ఆయనకు ఆమె డైవోర్స్ ఇస్తారని, ఇందుకు నిముషాలు లెక్కపెట్టుకుంటున్నారని వీరి మాజీ అడ్మినిస్ట్రేషన్ సహచరులు చెబుతున్నారంటూ డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెలనియాకు మాజీ సీనియర్ అడ్వైజర్ అయిన  స్టెఫానీ వోకాఫ్  ఈ షాకింగ్ సమాచారాన్ని తెలియజేసినట్టు ఈ కథనం పేర్కొంది. వైట్ హౌస్ లో ట్రంప్, మెలనియాలకు వేర్వేరు బెడ్ రూమ్స్ ఉన్నాయని, వారి పెళ్లి కేవలం ‘ లావాదేవీ’ మాత్రమేనని స్టెఫానీ చెబుతున్నారు. ఒమరోసా న్యూమన్ అనే మరో మాజీ అడ్వైజర్ కూడా ట్రంప్, మెలనియాల  15 ఏళ్ళ వెడ్డింగ్ ఇక ముగిసినట్టేనని  పేర్కొన్నారు. ట్రంప్ అటు వైట్ హౌస్ వదలగానే ఇటు మెలనియా విడాకులివ్వడం గ్యారంటీ అని ఒమరోసా  చెబుతోందట.. కానీ ఈ వార్తలు ఎంతమాత్రం నిజమో కాదో గానీ ఇద్దరూ బయటికి చిరునవ్వులు చిందిస్తూ చేతుల్లో చేతులు కలిపి నడుస్తుంటే మాత్రం ఇలాంటి కథనాలు నమ్మబుధ్ది కాదు.. కానీ హౌస్ లో జరిగే సమాచారం మాత్రం బయటికి పొక్కదంటున్నారు.