
మెగా ఫ్యామిలీ, వారి కోకాపేట్ వ్యవసాయ భూమిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఫిల్మ్ స్టూడియోను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ ఇప్పటికే ఈ సైట్ లో సైరా ఇంకా చిరు 152వ ప్రాజెక్ట్ లకు సంబంధించిన సెట్స్ కూడా వేసినందున ఈ వార్త మరింత బలపడుతూ వచ్చింది.. అయితే చాలా రీసెర్చ్ చేసిన తరువాత.. చిరంజీవి స్టూడియోని స్థాపించే ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది.
రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అతి పెద్ద స్టూడియో అందుబాటులో ఉన్నందున, హైదరాబాద్‌లో మరే ఇతర పెద్ద స్టూడియో అవసరం లేదు. పైగా ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ అంతా కాంపాక్ట్ గా మారి అందుబాటులోకి రావడంతో షూటింగ్ లని ప్రతి చిన్న ప్రదేశంలో కూడా చేసుకునేందుకు వీలుంటుంది. దీని వల్ల స్టూడియోల అవసరం చాలావరకూ తగ్గిపోయింది.
పైగా, ఇప్పటికే ఈ రంగంలో తలపండిన ప్రసాద్ ల్యాబ్స్, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలు కూడా లాభాలు తగ్గి నష్టాల్లో నడుస్తున్నట్టే సమాచారం.. దీంతో భారీ పెట్టుబడితో ఫిల్మ్ స్టూడియోని నిర్మించడానికి బదులుగా, రిసార్ట్ లేదా ఫంక్షన్ హాల్ నిర్మించడం లాభదాయకంగా ఉంటుందని చిరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కోకాపేట్, వైజాగ్‌లలో మెగా ఫిల్మ్ స్టూడియో నిర్మాణ ఆలోచనను మెగాస్టార్ వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.