AP: ఆమె నీడ పడితే చనిపోతారట.. తనకు శాపం ఉందని ఊహించని పని చేసిన విద్యార్థిని
శాపం ఉందంటూ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
ఇటీవల హైదరాబాద్(Hyderabad) తన గత జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నానంటూ ఓ 13 ఏళ్ల బాలుడు సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే ఏపీ మార్కాపురం( Markapuram)లో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. మార్కాపురంలో ఓ బీఎస్సీ విద్యార్థిని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. అందుకు కారణం ఆమెకు శాపం ఉందట. ఆ శాపం కారణంగా తన నీడ ఎవరి మీద పడినా వారు చనిపోతారట. ఆ భయంతో విద్యార్థిని బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తన శాపం పోవడానికి పూజ చేయించినా ఫలితం కనిపించలేదంటూ ఓ లేఖ కూడా రాసింది. తనకున్న శాపం కారణంగా తన నీడ పడి తల్లిదండ్రులు, తమ్ముడు చనిపోకూడదనే ఉద్దేశంతో తానే చనిపోతున్నానంటూ లేఖ రాసింది. ఆ లేఖను వాట్సాప్ లో పంపి.. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ లెటర్ చూసిన తండ్రి చివరి నిమిషంలో హుటాహుటిన వెళ్లి కుమార్తెను కాపాడుకున్నాడు. బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు, యువతీయువకులు.. ఈ తరహా ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: Andhra Pradesh: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక.. బీ అలెర్ట్