AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్య ! అక్కడ సమ్మె ముప్పు తప్పింది !!

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు మరో సమ్మె ముప్పు తప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాల మాదిరి ఇక్కడి కార్మిక సంఘాలు మొండికేయకపోవడంతో కెసీఆర్ సర్కార్ పాచిక పారింది. ఇంతకీ ఈ సమ్మె ముప్పు ఎక్కడంటారా ? తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్యలపై జెన్‌కో, ట్రాన్స్‌కో కార్మికులు యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితం సమ్మె నోటీసునిచ్చాయి. వాటిపై చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ఆర్టీసీ విషయంలో చేసినట్లు చేస్తే సమ్మె తప్పదని హెచ్చరించాయి. […]

హమ్మయ్య ! అక్కడ సమ్మె ముప్పు తప్పింది !!
Rajesh Sharma
|

Updated on: Oct 19, 2019 | 4:59 PM

Share

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు మరో సమ్మె ముప్పు తప్పింది. ఆర్టీసీ కార్మిక సంఘాల మాదిరి ఇక్కడి కార్మిక సంఘాలు మొండికేయకపోవడంతో కెసీఆర్ సర్కార్ పాచిక పారింది. ఇంతకీ ఈ సమ్మె ముప్పు ఎక్కడంటారా ? తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్యలపై జెన్‌కో, ట్రాన్స్‌కో కార్మికులు యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితం సమ్మె నోటీసునిచ్చాయి. వాటిపై చర్చలకు సిద్దమని ప్రకటించాయి. ఆర్టీసీ విషయంలో చేసినట్లు చేస్తే సమ్మె తప్పదని హెచ్చరించాయి.

ప్రభుత్వం సానుకూలం..

విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్‌ విధానం అమలుతో పాటు ఇతర డిమాండ్ల సాధనపై కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్‌ యాజమాన్యం శనివారం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణ ముంగిట మరో సమ్మె తప్పినట్లు అయ్యింది.