AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం పసివాడు..లక్షలు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన మరుసటి రోజే బ్రేకప్‌..! ప్రియురాలు చేసిన మోసంపై యువకుడి ఆవేదన!

ప్రేమికులు తమ భాగస్వాముల కోసం ఏదైనా చేస్తారు.. కానీ, ఒక యువకుడి పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు తన ప్రియురాలి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సుమారు 300,000 రూపాయల విలువైన ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. అయితే, ఆ బహుమతి అందుకున్న మరుసటి రోజే ఆమె అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు, అతను తన బహుమతిని వెనక్కి తీసుకోవచ్చా లేదా అనే దానిపై సోషల్ మీడియాలో న్యాయ సలహా కోరుతున్నాడు.

పాపం పసివాడు..లక్షలు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన మరుసటి రోజే బ్రేకప్‌..! ప్రియురాలు చేసిన మోసంపై యువకుడి ఆవేదన!
Girlfriend Breakup StoryImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 12:40 PM

Share

ప్రేమ, బంధాలలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. కానీ నేటి కాలంలో కొందరు కేవలం డబ్బు, ఖరీదైన వస్తువుల కోసమే ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అవసరం తీరగానే ముఖం చాటేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన, షాకింగ్ ఘటనే యూకే (UK) లో వెలుగుచూసింది. గర్ల్‌ఫ్రెండ్‌ను నమ్మి లక్షల రూపాయల విలువైన బహుమతి ఇచ్చిన ఒక యువకుడికి, ఆమె మరుసటి రోజే ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ఖరీదైన గిఫ్ట్ చేతికి అందగానే బ్రేకప్ చెప్పేసి మొహం చాటేసింది. అసలేం జరిగిందంటే..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ (Reddit) లో ఒక యువకుడు తన దగా పడ్డ ప్రేమకథను పంచుకున్నాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎప్పటి నుంచో అడుగుతున్న 2,500 పౌండ్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 3.1 లక్షలు) విలువైన హై-ఎండ్ గేమింగ్ కంప్యూటర్‌ను ఎంతో ఇష్టంగా కొనిచ్చాడు. అయితే, అతడు ఊహించని విధంగా, బహుమతి అందుకున్న సరిగ్గా మరుసటి రోజే ఆ యువతి అతనికి బ్రేకప్ చెప్పేసింది.

ఈ ఆకస్మిక బ్రేకప్‌తో షాకైన ఆ యువకుడు, అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఘోరమైన నిజం బయటపడింది. ఆమె కొన్ని నెలల క్రితమే అతనికి దూరమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ, ఎలాగైనా అతని నుండి ఆ ఖరీదైన గేమింగ్ పీసీని ఉచితంగా పొందాలనే దురాశతో, పుట్టినరోజు వరకు ప్రేమ నటిస్తూ నాటకమాడింది. దీనికి సంబంధించిన కొన్ని చాట్ స్క్రీన్ షాట్లు ఆమె తన స్నేహితులతో మాట్లాడినవి కూడా ఆ యువకుడు సంపాదించాడు.

ఇవి కూడా చదవండి

మోసపోయానని గ్రహించిన సదరు యువకుడు ఆ గేమింగ్ కంప్యూటర్‌ను తిరిగి దక్కించుకోవడానికి లేదా తాను ఖర్చు చేసిన డబ్బును వసూలు చేయడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అయితే, యూకే చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తికి పూర్తిగా ఇష్టపూర్వకంగా ఇచ్చిన బహుమతి అనేది చట్టబద్ధంగా తీసుకున్న వ్యక్తి యొక్క ఆస్తిగా మారుతుంది. దానిని తిరిగి లాక్కోవడం చట్టపరంగా సాధ్యం కాదు.

ఈ విషయాన్ని తెలుసుకున్న యువకుడు తీవ్ర నిరాశకు గురై.. ఆమె నన్ను మోసం చేయడానికే ప్లాన్ వేసిందని నిరూపించే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై కోర్టుకు వెళ్తే నాకు న్యాయం జరుగుతుందా? అని నెటిజన్లను సలహా కోరాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను గోల్డ్ డిగ్గర్ అని విమర్శిస్తుండగా, మరికొందరు స్మాల్ క్లెయిమ్స్ కోర్టును ఆశ్రయించి మోసం కింద కేసు వేయాలని సలహా ఇస్తున్నారు. ఈ కాలంలో ఎవరిని నమ్మి ఎంత ఖర్చు పెడుతున్నామనే విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ విచిత్ర ఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us