Viral Video: రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
వంద రూపాయల నోటు మీదేనా.. ఆ పక్కన ఉంది.. ఒక్కసారి చూడండి అంటూ.. మాటలు కలిపాడు. నాదే కావచ్చు అన్నాడు మరో అతను. వంద రూపాయల.. నోట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే.. బ్యాంకు నుంచి అప్పుడే డ్రా చేసుకుని వచ్చిన రూ.1,50,000 డబ్బును ఎత్తుకెళ్లిందో దొంగల ముఠా..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో నుంచి తన సొంత అవసరాల కోసం రూ. 1,50,000 శ్రీహరి అనే వ్యక్తి డ్రా చేసుకున్నారు. తన ద్విచక్ర వాహనంలో ఈ డబ్బులను పెట్టుకున్నాడు. ముందు నుంచే ఓ వ్యక్తి అతన్ని గమనిస్తున్నాడు. వీరంతా నలుగురు ముఠా సభ్యులు. ఆ నలుగురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి శ్రీహరి దగ్గరికి వచ్చి.. అక్కడ రూ.100 నోటు కనిపిస్తుంది. అది మీదే నా అని అతని దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ వ్యక్తి అటు తిరిగాడు. ఇంకేముంది.. నలుగురులో నుంచి ఓ వ్యక్తి అటుగా వచ్చి బైక్ పై ఉన్న రూ.1,50,000 డబ్బులు దొంగలించి బైక్‌పై ఉడాయించాడు. ఆ తర్వాత రూ.వంద మీవేనా అని అడిగిన వ్యక్తి అప్పటి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్న మరో వ్యక్తితో అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర బాధితుడు తన డబ్బులు చెక్ చేసుకోగా అవి మాయమైపోయాయి. వచ్చిన వాళ్ళు దొంగలు అనుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు సంబంధించిన కెమెరాలతో పాటు పక్కన ఉన్న సీసీ కెమెరాలో దొంగల బాగోతం మొత్తం రికార్డయింది. ఆ రికార్డులు స్వాధీనం చేసుకొని దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. వంద రూపాయల కోసం చూస్తే.. లక్ష 50 వేయిల రూపాయలు మాయమాయ్యాయి. ఇటీవల.. బ్యాంకు సమీపంలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వారిని మాటల్లో పెట్టి నగదు దోచుకెళ్తున్నారు. డబ్బులు తీసుకొని వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.