Watch Video: జీవితం ఏం హాలత్ అయిందిరా నాయనా.. రోలర్ కోస్టర్‌పై జూమ్ కాల్!
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్ సాధారణమైన ఈ రోజుల్లో ఉద్యోగులు పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. కానీ ఓ ఉద్యోగి చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో దక్షిణ కొరియాకు చెందిన ఓ ఉద్యోగి ఆన్‌లైన్ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. అతని సహోద్యోగులు, బాస్ అందరూ తమ ఇళ్లలో నుంచే మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని రోలర్ కోస్టర్‌పై ప్రయాణిస్తూ మీటింగ్‌లో చేరాడు. తాను బయట ఉన్నాననే విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అతడు తన వెనుక నకిలీ వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో అతని ప్లాన్ బాగా పనిచేసింది. ప్రశాంతంగా కూర్చుని, సాధారణ ఉద్యోగిలా మీటింగ్‌లో పాల్గొన్నాడు. కానీ రోలర్ కోస్టర్ వేగం పెరిగిన కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రైడ్ ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లడంతో ఉద్యోగి గాలిలో ఊగిపోవడం ప్రారంభించాడు. దీంతో అతను ఉపయోగించిన క్రోమా ఎఫెక్ట్ విఫలమై, అసలు విషయం బయటపడింది. అతను గదిలో కాకుండా రోలర్ కోస్టర్‌పై ప్రయాణిస్తున్నాడని స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన సహోద్యోగులు, బాస్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగినప్పటికీ మీటింగ్ మాత్రం ఆగలేదు. ఉద్యోగి కూడా ఏమీ జరగనట్లు పాల్గొనడం కొనసాగించాడు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @unfoldingbharat అనే ఖాతా షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోకు 26 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. “ఇదే అసలైన మల్టీటాస్కింగ్”, “రోలర్ కోస్టర్‌పైనే ఆఫీస్ పని పూర్తి చేశాడు” అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..