IND vs AFG 2nd ODI: టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు.. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఎవరొచ్చారంటే?
India vs Afghanistan 2nd ODI: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు పరిమితమైన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది. టీమిండియా ఈ లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

India vs Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో వన్డే బుధవారం (జూన్ 17) లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా, ప్రస్తుతం 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రేపటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
అందుబాటులో లేని కోహ్లీ, హార్దిక్..!
గాయాల కారణంగా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రెండో వన్డేలో కూడా ఆడరు.
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడంతో 2వ వన్డేలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అదేవిధంగా, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనున్నాడు.
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అందువల్ల, అతడిని తుది జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. దీని ప్రకారం, టీమిండియా తుది జట్టు ఈ కింది విధంగా ఉండే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్
కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్)
నితీష్ కుమార్ రెడ్డి
వాషింగ్టన్ సుందర్
హర్ష్ దుబే
అర్ష్‌దీప్ సింగ్
గుర్నూర్ బ్రార్
ప్రిన్స్ యాదవ్
మ్యాచ్ వివరాలు..
తేదీ: జూన్ 17, 2026 (బుధవారం)
సమయం: మధ్యాహ్నం 1:30 (టాస్ మధ్యాహ్నం 1:00 గంటకు)
వేదిక: ఎకానా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, లక్నో.
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, ‘జియోహాట్‌స్టార్’ యాప్/వెబ్.
భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ 2వ వన్డే – ముఖ్యమైన ప్రశ్నలు (FAQs)..
1. భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ 2వ వన్డే మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
బుధవారం, జూన్ 17, 2026 న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకి ప్రారంభమవుతుంది.
2. ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ ఏ స్థితిలో ఉంది?
ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
3. ఈ మ్యాచ్‌ను లైవ్ ఎక్కడ చూడవచ్చు?
ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో ‘స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్’ ద్వారా మొబైల్/వెబ్‌సైట్‌లతోపాటు ‘జియోహాట్‌స్టార్’ (JioHotstar) యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
