అఫ్ఘన్ టు ముంబై.. రూ.వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టబడింది. ఆఫ్ఘనిస్తాన్‌  నుంచి ముంబై తీసుకొస్తుండగా పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు.. ఓడ రేవు దగ్గర వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

  • Sanjay Kasula
  • Publish Date - 11:37 am, Mon, 10 August 20
అఫ్ఘన్ టు ముంబై.. రూ.వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Major Drug Haul in Mumbai : ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టబడింది. ఆఫ్ఘనిస్తాన్‌  నుంచి ముంబై తీసుకొస్తుండగా పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు.. ఓడ రేవు దగ్గర వెయ్యికోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 191 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిందితులకు 14 రోజుల జ్యడీషియల్‌ కస్టడీ విధించారు. కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ దందా బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి డ్రగ్స్‌ను తీసుకొస్తున్నట్లు గుర్తించారు.

నవీ ముంబైలోని న్వా షెవా ఓడరేవు వద్ద రూ .1000 కోట్ల విలువైన 191 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పైపుల లోపల దాచి తీసుకొస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతన్న ఆయుర్వేద వనమూలికలుల్లో వాటిని దాచి తీసుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.