మహారాష్ట్రలో కొత్తగా 18,056 కరోనా పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 20వేలకు తగ్గకుండా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 20వేలకు తగ్గకుండా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 18,056 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, ఇవాళ ఒక్క రోజు మహమ్మారి బారినపడి 380 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఇవాళ కరోనా వైరస్ నుంచి కోలుకొని 13,656 మంది ఇళ్లకు చేరుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,39,232కు చేరగా.. ప్రస్తుతం 2,73,228 యాక్టివ్ కేసులు ఉన్నాయి..ఇక, ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా10,30,015 మంది డిశ్చార్జి అయ్యినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు ముంబైలో మహానగరంలో వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,261 కొవిడ్ కేసులు నిర్ధారణ కాగా.. 44 మరణించినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ముంబైలో మొత్తం మరణాల సంఖ్య 8,791కు చేరిందని బీఎంసీ తెలిపింది.