Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Kamble Dance : ఆటో డ్రైవర్ డ్యాన్స్ అదుర్స్.. నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో.. ఒక్క రోజులో లక్షల వ్యూస్..

Baba Kamble Dance : మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆటో డ్రైవర్ చేసిన డ్యాన్స్ దేశ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఎన్నో రోజులు శ్రమకు ఓర్చి చేసే డ్యాన్స్‌ను బాబా కాంబ్లే అనే వ్యక్తి అలవోకగా ప్రదర్శించాడు.

Baba Kamble Dance : ఆటో డ్రైవర్ డ్యాన్స్ అదుర్స్..  నెటిజన్లు ఫిదా.. వైరల్‌గా మారిన వీడియో.. ఒక్క రోజులో లక్షల వ్యూస్..
Follow us
uppula Raju

| Edited By: Team Veegam

Updated on: Mar 08, 2021 | 3:20 PM

Baba Kamble Dance : మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆటో డ్రైవర్ చేసిన డ్యాన్స్ దేశ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఎన్నో రోజులు శ్రమకు ఓర్చి చేసే డ్యాన్స్‌ను బాబా కాంబ్లే అనే వ్యక్తి అలవోకగా ప్రదర్శించాడు. గొప్ప గొప్ప డ్యాన్సర్లకు సాధ్యం కాని పనిని సింపుల్‌గా చేసి చూపించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. రెండు రోజుల క్రితం, బాబా కాంబ్లేతో పాటు అతడి తోటి డ్రైవర్లు మాలెగావ్‌లోని ఓ పెట్రోల్ పంపుకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. అయితే వారు వచ్చే సమయానికి విద్యుత్ లేనందున మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వారు పక్కన ఉన్న ఓ పార్కులో గుంపుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏం చేయాలో తెలియక బాబా కాంబ్లే డ్యాన్స్ ప్రారంభించాడు. దీంతో తోటి డ్రైవర్లు సహకారం అందించడంతో చాల చక్కగా డ్యాన్స్ చేశాడు. ఇంతలో అక్కడున్న వారందరు అతడి డ్యాన్స్ ను ఎగబడి చూశారు. తమ సెల్‌ఫోన్‌లలో వీడియో తీసుకున్నారు. దీంతో ఆ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా బాబా కాంబ్లేకు చేరింది. దీంతో ఆ వీడియో చూసిన కాంబ్లే మురిసిపోయాడు. అంతేకాకుండా ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ వస్తాయని ఊహించలేదన్నాడు. అంతేకాకుండా అతడి డ్యాన్స్ చూసిన సెలబ్రిటీలు అతడికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బారామతి తాలూకాలోని గున్వాడిలో నివసించే బాబా కాంబ్లే గ్రామ పంచాయతీ సభ్యుడు. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ను ఇష్టంగా చేస్తున్నాడు. వివిధ నృత్య రూపాలను నేర్చుకున్నాడు. కానీ సరైన అవకాశాలు లేక ఆటోనడుపుతూ జీవనం గడుపతున్నాడు. ఒక్క రాత్రిలో ఈ వీడియో హల్ చల్ చేయడంతో ఇప్పడు బాబా కాంబ్లేను ఎక్కడికి వెళ్లినా అందరు గుర్తుపడుతున్నారు. ఏదైనా అవకాశం ఇస్తే మరింత డ్యాన్స్ చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తన మనసులో మాట చెప్పాడు బాబా కాంబ్లే.

భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు వదిలి వెళ్లిన భర్త.. 19 నెలల తరువాత

Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి… ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు