AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు వదిలి వెళ్లిన భర్త.. 19 నెలల తరువాత

తన భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ భర్త ఉద్యోగం వదిలి, ఇల్లు విడిచివెళ్లిపోయాడు. కట్‌ చేస్తే 19 నెలల తరువాత అతడి ఆచూకీని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలుసుకున్నారు

భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు వదిలి వెళ్లిన భర్త.. 19 నెలల తరువాత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 27, 2020 | 2:40 PM

Share

Husband leave home: తన భార్య తిట్ల నుంచి తప్పించుకునేందుకు ఓ భర్త ఉద్యోగం వదిలి, ఇల్లు విడిచివెళ్లిపోయాడు. కట్‌ చేస్తే 19 నెలల తరువాత అతడి ఆచూకీని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలుసుకున్నారు. ఈ మధ్యలో తనను తాను పోషించుకునేందుకు ఓ కారు డ్రైవర్‌గా పని చేశాడు. మరోవైపు అతడి ఆచూకీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భార్య.. ఎట్టకేలకు విజయం సాధించింది. ఏంటి మీరు చదువుతున్నది సినిమా స్టోరీ కాదు.. వెబ్‌సిరీస్ స్టోరీ అంతకన్నా కాదు. నిజంగా జరిగినదే. (సంజయ్‌ దత్‌ని కలిసిన కంగనా రనౌత్‌.. ఖల్‌ నాయక్‌ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారన్న నటి )

వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌లో పెయింటర్‌గా పనిచేసే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ఢిల్లీలో నివసించేవాడు. ఈ క్రమంలో గతేడాది ఏప్రిల్‌ 12న పనిమీద నోయిడాకు వెళ్లిన అతడు ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి అదృశ్యం వెనుక భర్త సన్నిహితుడు ఉన్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అతడి చివరి కాల్‌లో ఓ బంధువుల అతడితో మాట్లాడినట్లు గుర్తించారు. కానీ ఆ వ్యక్తి వివరాలు మాత్రం తెలియలేదు. దీంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. (Official: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ.. ఇక్కడ పరిచయం చేసిన వినాయక్‌నే అక్కడ కూడా)

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ అక్టోబర్ 15న కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ని ఇవ్వాలని ఢిల్లీ పోలీస్‌ క్రైమ్ బ్రాంచ్‌కి సూచించింది. ఈ క్రమంలో లోతైన విచారణ చేసిన ఢిల్లీ పోలీసులు హర్యానాలోని మేవత్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి అతడిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నించారు. అయితే తాను మద్యం సేవించినప్పుడు భార్య తరచుగా తిడుతూ ఉండేదని, వాటిని తప్పించేందుకే తాను దూరంగా ఉండేందుకు తాను ఇక్కడకు వచ్చానని అతడు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో అతడితో పాటు భార్యకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు.. వారిద్దరిని ఇంటికి పంపారు. (బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతున్న ఊసరవెల్లి.. ప్రకటించిన ప్రముఖ నిర్మాత.. ఎన్టీఆర్ పాత్రలో అక్షయ్‌..!)

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్