హ్యాట్సాఫ్.. యూఎన్‌ఏడీఏపీ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బార్బర్ కుమార్తె…

యూఎన్‌ఏడీఏపీ (యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా మధురైకు చెందిన బార్బర్ కుమార్తె నేత్ర(13) ఎంపికైంది.

హ్యాట్సాఫ్.. యూఎన్‌ఏడీఏపీ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బార్బర్ కుమార్తె...
Follow us

|

Updated on: Jun 06, 2020 | 11:26 AM

యూఎన్‌ఏడీఏపీ (యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా మధురైకు చెందిన బార్బర్ కుమార్తె నేత్ర(13) ఎంపికైంది. కోవిడ్-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ‌ల‌స కూలీలు, రోజువారి శ్రామికుల వెత‌లు చూసి చలించిన‌ నేత్ర తన ఉన్న‌త‌ చదువు కోసం తండ్రి దాచిన రూ. 5 లక్షల నగదును పేదలకు స‌హాయం చేసేందుకు తండ్రిని ఒప్పించింది. త‌న‌కున్న స్థో‌మ‌త‌తో చాలా పెద్ద సాయ‌మే చేసింది. బాలిక గొప్ప‌త‌నాన్ని, గుణాన్ని ఆ రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు ప్ర‌శంసించారు. విద్యార్థినికి జయలలిత అవార్డును ఇవ్వాల్సిందిగా సీఎం పళనిస్వామికి సిఫార్సు చేశారు.

కాగా కొద్దిరోజుల క్రితం మన్‌ కీ బాత్‌ రేడియో కార్య‌క్ర‌మంలో మాట్లాడిన‌ ప్రధాని నరేంద్రమోదీ సైతం బాలికను, ఆమె తండ్రి మోహన్ నిర్ణ‌యాన్ని అభినందించారు. మధురైకు గర్వకారణంగా వారు నిలిచార‌ని కొనియాడారు. తన తండ్రి జీవిత కాలం వెచ్చించి సంపాదించిన మొత్తాన్ని, ఓ బాలిక త‌న భవిష్య‌త్తును కూడా ఆలోచించకుండా పేదలకు పంచడం గొప్ప విషయమన్నారు. నేత్ర త్వరలోనే న్యూయార్క్‌లో జరిగే యూనైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌, జెనివాలో జరిగే సివిల్‌ సొసైటీ ఫోరం కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నట్లు మోదీ తెలిపారు.

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.