మధ్యప్రదేశ్​ ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

మధ్యప్రదేశ్​ ఉపఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ​ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద […]

Venkata Narayana

|

Nov 10, 2020 | 7:40 AM

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ​ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసీ సూచనల మేరకు.. కేవలం ఎన్నికల అభ్యర్థులు.. వారి పోలింగ్​ ఏజెంట్లు​, కౌంటింగ్​ ఏజెంట్లు​ మాత్రమే కేంద్రాల వద్ద ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu