ఏపీ ప్రభుత్వం తీపికబురు.. ఇకపై రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ..
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రమంతా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఈ పధకం అమలవుతున్న సంగతి

YSR Aarogya Sri: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రమంతా విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఈ పధకం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన ఆరు జిల్లాల్లోనూ ఈ పధకం అమలు కానుంది. ఇవాళ శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పధకాన్ని సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా, ఇప్పటికే 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పధకంలో అదనంగా 234 వ్యాధులను చేర్చారు. దీనితో మొత్తం 2,434 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులు రూ. 1000 దాటితే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
Also Read: అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
Aarogya Sri SchemeAndhra Pradesh News UpdatesHospital Bill Cross 1000Jagan Government DecisionLatest Andhra Pradesh News