కాసేపట్లో దుబ్బాక కౌంటింగ్.. ఫలితంపై సర్వత్రా ఆసక్తి
తెలంగాణలోని దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా, మరో సర్వే టీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ఇంకో సర్వే బీజేపీ జెండా ఎగరడం తథ్యమని చెప్పడంతో ప్రజల్లో సందిగ్ధత నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో దుబ్బాక […]

తెలంగాణలోని దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా, మరో సర్వే టీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ఇంకో సర్వే బీజేపీ జెండా ఎగరడం తథ్యమని చెప్పడంతో ప్రజల్లో సందిగ్ధత నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఫలితంపై ఉత్కంఠత కొనసాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతగా లేదనేదీ వివిధ సంస్థలు తెలిపిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు తమదే విజయమని చెప్తున్నప్పటికీ, నిశబ్ధంగా సాగిన ఓటింగ్‌లో పైచేయి ఎవరిదనేదీ మాత్రం అందరినీ సంశయంలో పడేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే దుబ్బాక ఉపఎన్నికలో అసలు విజేత ఎవరనేది నిర్ధారణ కాబోతోంది. దుబ్బాక ఓటరు తీర్పుపై లైవ్ అప్డేట్స్ మీ కోసం ఈ దిగువన.