Madhav Seth: గతేడాది అసాధారణ వృద్ధిని సాధించాం.. 2021లో సరికొత్త లక్ష్యాలను కలిగి ఉన్నామంటున్న..
Madhav Seth: ఈ ఏడాది తమ కంపెనీ ఇండియాలో 2.3 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరుపుతుందని రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ అంచనా వేస్తున్నారు. గతేడాది
Madhav Seth: ఈ ఏడాది తమ కంపెనీ ఇండియాలో 2.3 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరుపుతుందని రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ అంచనా వేస్తున్నారు. గతేడాది కంపెనీ అసాధారణమైన వృద్ధిని సాధించిందని, కరోనా కారణంగా పావువంతు విలువైన అమ్మకాలను కోల్పోయినా మంచి వృద్ధినే సాధించిందని వెల్లడించారు. రియల్ మీ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో 25 శాతంతో 1.9 కోట్ల యూనిట్ల అమ్మకాలను కంపెనీ నిర్వహించగలిగిందని ప్రకటించారు. అయితే సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కొన్ని అమ్మకాలు కోల్పోయామని చెప్పారు. అయినప్పటికీ 2019 సంవత్సరంతో 1.5 కోట్ల యూనిట్లతో పోలిస్తే 2020లో 1.9 కోట్లకు అమ్మకాల వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ వృద్ధి అసాధారణమని ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం ముగిసే లోపు 2.3 కోట్ల అమ్మకాలు సాధించగలమనే నమ్మకం ఉందని అన్నారు. 2021లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.