AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా’లో మళ్ళీ లొల్లి.. వేదికపైనే ప్రముఖుల కాళ్ళు మొక్కిన రాజశేఖర్!

మా అసోసియేషన్‌లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఇవాళ పార్క్ హయత్‌లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు వంటి ప్రముఖుల సమక్షంలో మా డైరీ ఆవిష్కరణ జరుగుతుండగా.. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిరంజీవి ప్రసంగిస్తున్న తరుణంలో రాజశేఖర్ పదేపదే అడ్డుపడటమే కాకుండా ఆయన దగ్గర నుంచి మైకు లాక్కుని దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశాడు. మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయన్న […]

'మా'లో మళ్ళీ లొల్లి.. వేదికపైనే ప్రముఖుల కాళ్ళు మొక్కిన రాజశేఖర్!
Ravi Kiran
|

Updated on: Jan 02, 2020 | 1:19 PM

Share

మా అసోసియేషన్‌లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఇవాళ పార్క్ హయత్‌లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు వంటి ప్రముఖుల సమక్షంలో మా డైరీ ఆవిష్కరణ జరుగుతుండగా.. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిరంజీవి ప్రసంగిస్తున్న తరుణంలో రాజశేఖర్ పదేపదే అడ్డుపడటమే కాకుండా ఆయన దగ్గర నుంచి మైకు లాక్కుని దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో తమను తొక్కేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేశాడు. మా అసోసియేషన్ వల్ల తన ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయన్న ఆయన.. తనకు కారు ప్రమాదం కూడా ఇందువల్లే జరిగిందన్నారు. నిందలొచ్చినా ఫర్లేదని.. తాను ఎప్పుడూ నిజమే చెబుతానని అంటూ వేదికపై ఉన్న ప్రముఖులందరికీ రాజశేఖర్ కాళ్లు మొక్కారు. ఇక ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు

అటు చిరంజీవి మాట్లాడుతూ.. రాజశేఖర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రోటోకాల్ పాటించని వ్యక్తుల గురించి ఏం మాట్లాడగలమని.. ఇక్కడ తన మాటకు విలువే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్‌కు తాను అన్నీ అర్ధమయ్యేలా చెప్పానని.. మంచి ఉంటే మైకులో చెప్పమని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నానని స్పష్టం చేశారు. అయినా కూడా వినకుండా తన నుంచి మైకు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా, పథకం ప్రకారమే రసాభాస చేసేందుకు రాజశేఖర్ యత్నించారని చిరంజీవి ఆరోపించారు. అంతేకాకుండా రాజశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.