లవ్ జిహాాది స్టోరీలో మరో ట్విస్ట్
హైదరాబాద్ లో మరో లవ్ జిహాద్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తమ కూతురిని ప్రేమ పేరుతో మతం మార్చి రిజ్వాన్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు యువతి తల్లిదండ్రులు. తమను కలవాలని ఉందని అంటూ కూతురు మెసేజ్ చేసిందని చెబుతున్నారు. తమ కూతురి ఆచూకీ కనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చిరస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మహేశ్, రేణుక దంపతుల పెద్ద కుమార్తె కరీంనగర్‌లో బీటెక్ పూర్తి […]
హైదరాబాద్ లో మరో లవ్ జిహాద్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తమ కూతురిని ప్రేమ పేరుతో మతం మార్చి రిజ్వాన్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు యువతి తల్లిదండ్రులు. తమను కలవాలని ఉందని అంటూ కూతురు మెసేజ్ చేసిందని చెబుతున్నారు. తమ కూతురి ఆచూకీ కనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చిరస్తున్నారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మహేశ్, రేణుక దంపతుల పెద్ద కుమార్తె కరీంనగర్‌లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చింది. టెక్‌మహింద్రాలో సాఫ్టవేర్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తోంది. బీటెక్ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్ అహ్మద్ రిజ్వాన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. మతం మార్చుకోవడమే కాకుండా తన పేరును జుబేదాగా మార్చుకున్న విషయం కూడా ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. విషయం తెలుసుకున్న పేరంట్స్ ఆమెను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కొద్ది రోజుల క్రితం రిజ్వాన్‌ను పెళ్లి చేసుకున్నాని అంటూ తల్లిదండ్రులకు ఆ యువతి సమాచారమిచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం తమకు తెలియదని యువతి పేరంట్స్ అంటున్నారు. కరీంనగర్‌లో బీటెక్ చదువుతున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిందని అంటున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్‌లో యువతి మతం మారినట్టు స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. లవ్ జిహాద్ పేరుతో రిజ్వాన్ తమ కూతురిని పెళ్లి చేసుకుని సిరియాకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఆ యువతి కూకట్ పల్లిలోని ఓ హస్టల్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే హాస్టల్‌లో వెళ్లి చూస్తే తమ కూతురు కన్పించలేదని… కొట్టె మహేశ్ దంపతులు చెబుతున్నారు. పంజాగుట్ట ఎస్‌ఐ జావేద్‌కు ఫిర్యాదు చేస్తే సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తన కూతురిని బలవంతంగా మతం మార్చి రిజ్వాన్ పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తల్లి కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ కూతురిని తమకు అప్పగించాలని ఆమె పోలీసులను వేడుకుంటున్నారు. తమ కూతురిని వెంటనే చూపించకుంటే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు బీజేవైఎం కార్యకర్తలు ధర్నా చేశారు. అయితే పోలీసులు వాళ్లకు నచ్చజెప్పారు.
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న అన్నారు. 2018 లోనే రిజ్వాన్‌తో ఆ యువతి వివాహం జరిగిందని తెలిపారు. పేరంట్స్ ఆరోపణలు అవాస్తవమని ఆయనంటున్నారు. రిజ్వాన్‌తో మహేశ్ కూతురి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందని, ఇద్దరు మేజర్లని ఆయన వివరించారు. బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకుంటే ఆధారాలు ఇవ్వాలని యువతి తల్లిదండ్రులకు సూచించారు. తమకు ప్రాణభయం ఉందని ఆ జంట పోలీసులను ఆశ్రయించినట్లు కూడా వెల్లడించారు.