AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఒపీనియన్ పోల్ సర్వేలోనూ వారిదే హవా..!

మరోసారి బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే తన సత్తా చాటబోతున్నట్లు లోక్‌నీతి సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది.

బీహార్ ఒపీనియన్ పోల్ సర్వేలోనూ వారిదే హవా..!
Balaraju Goud
|

Updated on: Oct 20, 2020 | 9:54 PM

Share

మరోసారి బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే తన సత్తా చాటబోతున్నట్లు లోక్‌నీతి సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. జెడియూ బీజేపీ సారధ్యంలో ఎన్డీయే 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలకు పరిమితమవుతున్నట్లు సర్వే తెలిపింది.

రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారధ్యం వహిస్తోన్న లోక్‌ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధించవచ్చని తెలిపింది. ఇక, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని వెల్లడించింది. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ సర్వేలో తేలినట్లు లోక్‌నీతి సీఎస్‌డీఎస్ ప్రతినిధులు తెలిపారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 28న తొలి విడత, నవంబర్ 3న రెండో విడత, నవంబర్ ఏడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ పదిన ఫలితాలు ప్రకటిస్తారు. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖ నేతలందరూ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.

Follow Us
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం