AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లేస్ లేదు…ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేం!

కోల్‌కతా:  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా చేదు అనుభవం ఎదురైంది. సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌లో రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు కాంగ్రెస్‌ నేతలు అనుమతి కోరగా చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్‌ ఆదివారం సిలిగురిలో పర్యటించనున్నారు. డార్జిలింగ్‌లో జరగనున్న పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. స్థలం కొరత కారణంగా ల్యాండింగ్‌కు నిరాకరించినట్టు సిలిగురి పోలీస్‌ కమిషనర్‌ బీఎల్‌ మీనా తెలిపారు. ‘సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌లో చాలా వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయి. స్థలం […]

ప్లేస్ లేదు...ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేం!
Ram Naramaneni
|

Updated on: Apr 14, 2019 | 10:21 AM

Share

కోల్‌కతా:  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా చేదు అనుభవం ఎదురైంది. సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌లో రాహుల్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు కాంగ్రెస్‌ నేతలు అనుమతి కోరగా చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్‌ ఆదివారం సిలిగురిలో పర్యటించనున్నారు. డార్జిలింగ్‌లో జరగనున్న పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. స్థలం కొరత కారణంగా ల్యాండింగ్‌కు నిరాకరించినట్టు సిలిగురి పోలీస్‌ కమిషనర్‌ బీఎల్‌ మీనా తెలిపారు. ‘సిలిగురి పోలీస్‌ గ్రౌండ్‌లో చాలా వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయి. స్థలం లేకపోవడంతో రాహుల్‌ హెలికాప్టర్‌ను ఇక్కడ దించేందుకు మేం అనుమతి ఇవ్వలేం’అని మీనా వెల్లడించారు. అయితే పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాహుల్‌ హెలికాప్టర్ ల్యాండింగ్‌ కోసం ఏప్రిల్‌ 7నే పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశాం. అందుకు అనుమతి ఇవ్వలేమని ఈ రోజు ఉదయం కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. అనుమతి ఇవ్వలేమని ముందే చెప్పాల్సింది. చివరి నిమిషంలో చెప్తే ఎలా? ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది’ అని నేతలు విమర్శిస్తున్నారు. కాగా.. గతంలో యోగి ఆదిత్యనాథ్‌ హెలికాప్టర్ల ల్యాండింగ్‌కు కూడా బెంగాల్‌ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదిత్యనాథ్‌ ఝార్ఖండ్‌ వరకు హెలికాప్టర్‌లో వచ్చి అక్కడి నుంచి కారులో పశ్చిమబెంగాల్‌ వెళ్లారు.

Follow Us
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందే నిపుణుల చిట్కాలు
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్
పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్