లాక్‌డౌన్ పొడిగిస్తే మా వాళ్ల సంగతేంటి..?: జార్ఖండ్ సీఎం

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కోవిడ్ 19 వ్యాప్తిని బట్టే తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పేర్కొన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:54 pm, Fri, 10 April 20
లాక్‌డౌన్ పొడిగిస్తే మా వాళ్ల సంగతేంటి..?: జార్ఖండ్ సీఎం

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కోవిడ్ 19 వ్యాప్తిని బట్టే తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంపై చర్చించేందుకు ఇవాళ ఆయన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో కంటే మా దగ్గర పరిస్థితి భిన్నంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా మా రాష్ట్రానికి చెందిన దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. వాళ్ల గురించి కూడా మేము ఆలోచించాలి కదా…’’ అని ఝార్ఖంఢ్ సీఎం పేర్కొన్నారు.

కోవిద్ 19పై పోరాటానికి కేంద్రం మరింత సాయం అందించాలని హేమంత్ సొరేన్ అభ్యర్థించారు. కోవిడ్-19 పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించే అసాంఘిక శక్తుల విషయమై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కాగా జార్ఖండ్ ఇప్పటి వరకు 13 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించగా.. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య ఇవాళ 6,412కి చేరింది.

Also Read: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..