అమెరికాకు ఆ మందు రవాణా.. భారత్ రెడీ !

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును అమెరికాకు పంపేందుకు ఇండియా సమాయత్తమైంది. కోవిడ్-19 రాకాసితో బెంబేలెత్తుతున్న తమకు అత్యవసరంగా ఈ మెడిసిన్ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

అమెరికాకు ఆ మందు రవాణా.. భారత్ రెడీ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 10, 2020 | 7:54 PM

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును అమెరికాకు పంపేందుకు ఇండియా సమాయత్తమైంది. కోవిడ్-19 రాకాసితో బెంబేలెత్తుతున్న తమకు అత్యవసరంగా ఈ మెడిసిన్ కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. కాగా ఆ దేశానికి భారీగా మొదటి విడత సరఫరా వచ్ఛే వారం ప్రారంభమవుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ వారం కొంత మేరకు  ఈ మందును పంపడంతో ట్రంప్.. సంతృప్తి చెంది.. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికా వంటి దేశాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇండియాలో కొన్ని కంపెనీలు ఈ మెడిసిన్ ఉత్పత్తిని బాగా పెంచాయని సుదర్శన్ జైన్ చెప్పారు.  గుజరాత్ లోని కేడిలా అనే కంపెనీతో బాటు సుమారు 28 కంపెనీలు ఈ మందును ఉత్పత్తి చేస్తున్నాయి. పెరిగిన డిమాండు నేపథ్యంలో ఈ సంస్థలన్నీ పెద్దఎత్తున హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు జైన్ చెప్పారు. కేడిలా సంస్థ నెలకు 30 వేల మెట్రిక్ టన్నుల మందును ఉత్పత్తి చేయనారంభించిందని ఆయన వెల్లడించారు.