ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్‌లో మార్పులు..!

పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్‌ విద్యుద్దీకరణ పూర్తి అయిన దృష్ట్యా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి సవరించిన సమయపట్టికని నవంబరు 3వ తేదీ నుంచే అమలు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌ తెలిపారు. తొలుత వచ్చే ఏడాది జనవరి నుంచి  నూతన టైంటేబుల్‌ అమలు చేయాలని నిర్ణయించినప్పటికి రైల్వేబోర్డు తాజా ఆదేశాలతో తేదీని మార్పు చేశారు. నవంబరు 3వ తేదీ నుంచి… నెంబరు. 12796 లింగంపల్లి – విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు ఉదయం 9.20కే చేరుకొని 9.22కి బయలుదేరుతుంది. […]

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్‌లో మార్పులు..!
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Oct 12, 2019 | 11:38 AM

పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్‌ విద్యుద్దీకరణ పూర్తి అయిన దృష్ట్యా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి సవరించిన సమయపట్టికని నవంబరు 3వ తేదీ నుంచే అమలు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌ తెలిపారు. తొలుత వచ్చే ఏడాది జనవరి నుంచి  నూతన టైంటేబుల్‌ అమలు చేయాలని నిర్ణయించినప్పటికి రైల్వేబోర్డు తాజా ఆదేశాలతో తేదీని మార్పు చేశారు.
నవంబరు 3వ తేదీ నుంచి… నెంబరు. 12796 లింగంపల్లి – విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు ఉదయం 9.20కే చేరుకొని 9.22కి బయలుదేరుతుంది. మంగళగిరికి 9.42కి చేరుకొని 9.43కి బయలుదేరుతతుంది. విజయవాడకు ఉదయం 10.30కి చేరుతుంది.
 నెంబరు. 12795 విజయవాడ – లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌కి రాత్రి 10.20కి చేరుకొని 10.25కి బయలుదేరుతుంది. బేగంపేటకు రాత్రి 10.34కి చేరుకొని 10.35కి బయలుదేరి లింగంపల్లికి రాత్రి 11.15కి చేరుకొంటుంది.