పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్!

పంచాయతీ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 18-59 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారికి జీవితబీమా సౌకర్యాన్ని కల్పిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాదికి రూ.968 ప్రీమియంతో రూ.2 లక్షల జీవితబీమా సదుపాయం కలగనుంది. దేశ తొలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సురేంద్ర కుమార్ డేకు నివాళిగా పంచాయితీ కార్మికులకు జీవితబీమా పథకాన్ని అమలు చేయనుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రూ.5 లక్షల జీవిత […]

  • Ravi Kiran
  • Publish Date - 9:22 am, Sat, 4 January 20
పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్!

పంచాయతీ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. 18-59 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారికి జీవితబీమా సౌకర్యాన్ని కల్పిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాదికి రూ.968 ప్రీమియంతో రూ.2 లక్షల జీవితబీమా సదుపాయం కలగనుంది.

దేశ తొలి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సురేంద్ర కుమార్ డేకు నివాళిగా పంచాయితీ కార్మికులకు జీవితబీమా పథకాన్ని అమలు చేయనుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా పంచాయతీ కార్మికులకు కూడా జీవిత బీమా సౌకర్యాన్ని ప్రకటించింది. దీంతో పంచాయతీ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.