AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Formula 1 : హామిల్టన్ ఖాతాలో మరో విజయం..

లూయిస్‌ హామిల్టన్‌ మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు మెర్సిడెస్‌ టీమ్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌. తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు..

Formula 1 : హామిల్టన్ ఖాతాలో మరో విజయం..
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2020 | 10:47 AM

Share

Lewis Hamilton wins : లూయిస్‌ హామిల్టన్‌ మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్‌ టీమ్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు లూయిస్‌ హామిల్టన్‌. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 89వ టైటిల్‌ కావడం విశేషం. ఎఫ్ 1 రేసర్ దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డులకు దగ్గరగా చేరుకున్నాడు. మరో రెండు.. అంటే 91 టైటిల్స్ గెలుచుకుంటే మైకేల్ షుమాకర్‌కు సమానంగా మారుతాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి  మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. మరో రెండు టైటిల్స్‌ గెలిస్తే అత్యధిక ఎఫ్‌1 టైటిల్స్‌ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న రికార్డును హామిల్టన్‌ సమం చేస్తాడు. మెర్సిడెస్‌ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానాన్ని పొందాడు. ఒకే రేసులో ఇద్దరు మెర్సిడెస్‌ డ్రైవర్లు టాప్‌–2లో ఉండటం ఇది 50వసారి కావడం విశేషం. ఏడు రేసులు ముగిసిన ఈ సీజన్‌లో ప్రస్తుతం డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్‌ 157 పాయింట్లతో ‘టాప్‌’లో ఉన్నాడు.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ