పెద్దపల్లి జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల షాకింగ్ ట్రీట్మెంట్, వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులకు భారీ జరిమానాలు

వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులకు శనివారం భారీ జరిమానా విధించారు లీగల్ మెట్రాలజీ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్..

  • Venkata Narayana
  • Publish Date - 10:07 pm, Sat, 23 January 21
పెద్దపల్లి జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల షాకింగ్ ట్రీట్మెంట్, వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులకు  భారీ జరిమానాలు

వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులకు శనివారం భారీ జరిమానా విధించారు లీగల్ మెట్రాలజీ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో తూనికలు, కొలతల అధికారులు పలు షాపులపై దాడులు చేసి భారీ జరిమానా వసూలు చేశారు. తూకంలో మోసాలకు పాల్పడుతున్న షాపుల్ని, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, అధిక ధరలకు అమ్ముతున్నారని విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆరుగురు షాపు యజమానులకు నలభై అయిదు వేల రూపాయల భారీ జరిమానా విధించారు లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి విశ్వేశ్వర్.