గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ జిబిత్ జార్జ్(30) మృతి చెందారు. మే 9వ తేదీ రాత్రి గుండెపోటు రావడంతో ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. శనివారం జార్జ్‌కి ఛాతి నొప్పి వస్తున్నా.. దాన్ని పట్టించుకోకుండా తేలికగా తీసుకున్నారు. అయితే సాయంత్రం వరకూ ఆ నొప్పి తీవ్రతరం కావడంతో...

  • Tv9 Telugu
  • Publish Date - 10:51 am, Sun, 10 May 20
గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ జిబిత్ జార్జ్(30) మృతి చెందారు. మే 9వ తేదీ రాత్రి గుండెపోటు రావడంతో ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. శనివారం జార్జ్‌కి ఛాతి నొప్పి వస్తున్నా.. దాన్ని పట్టించుకోకుండా తేలికగా తీసుకున్నారు. అయితే సాయంత్రం వరకూ ఆ నొప్పి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. జిబిత్ మరణంతో మాలీవుడ్ (మలయాళం) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. జిబిత్‌కి తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు.

ఇటీవల చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. ‘కొజిప్పోర్ మూవీ’తో దర్శకుడిగా మారారు. ఆయన కెరీర్ ఇక ముందుకు సాగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో అర్థాంతరంగా గుండెపోటుతో మరణించడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. కొజిప్పోర్ సినిమా మార్చి 6వ తేదీన థియేటర్లలో ఉండగానే.. లాక్‌‌డౌన్ విధించడంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. ఇందులో హీరోయిన్ వీణా నందకుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన్పప్పటికీ.. కరోనా కారణంగా ప్రదర్శనలు నిలిపివేయడంతో జిబిత్ మనస్తాపానికి గురైనట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం మళ్లీ ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ జిబిత్ మరణించడం చిత్ర బృందాన్ని షాక్‌కి గురిచేసింది.

Read More: ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..