మ్యానిఫెస్టో పుస్తకం బుక్ చేస్తే భగవద్గీత డెలివరీ చేసిన అమెజాన్..!

ఆన్‌లైన్‌లో కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో బుక్‌ చేసిన వ్యక్తికి.. భగవద్గీ పంపింది అమెజాన్ సంస్థ.

మ్యానిఫెస్టో పుస్తకం బుక్ చేస్తే భగవద్గీత డెలివరీ చేసిన అమెజాన్..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2020 | 9:47 PM

ఆన్‌లైన్‌లో ఒకటి బుక్ చేస్తే మరొకటి రావడం పరిపాటిగా మారింది. ఈ మధ్య ఓ వ్యక్తి రూ.300 విలువ గల లోషన్ బాటిల్ బుక్ చేస్తే రూ.19,000 విలువ చేసే ఇయర్ ఫోన్స్ పంపింది ఓ సంస్థ. తాజాగా మరో కంపెనీ ఆన్‌లైన్‌లో కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో బుక్‌ చేసిన వ్యక్తికి.. భగవద్గీ పంపింది. కోల్‌కతాకు చెందిన సుతీర్థో దాస్ గత బుధవారం అమెజాన్‌లో కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టోపై మంచి డిస్కౌంట్‌ అఫర్ ను చూశాడు. దీంతో రూ.90 విలువైన పుస్తకం డిస్కౌంట్‌ తర్వాత 50 రూపాయలకు వస్తుండడంతో బుక్ చేశాడు. మొత్తం డెలివరీ చార్జెస్‌ కలుపుకుని రూ.140కు ఇంటికి చేరుతుందని సూచించడంతో దాన్ని వెంటనే ఆర్డర్‌ చేశాడు. గత శనివారం జూన్‌ 13 నాడు మధ్యాహ్నం 2 గంటలకు అమెజాన్‌లో ఆర్డర్‌ వచ్చింది. తీరా పార్సల్‌ తెరచి సరికి సుతీర్థో షాక్‌ అయ్యాడు. కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో ఆర్డర్‌‌ చేస్తే.. నాకు భగవద్గీతను డెలివరీ చేశారని తెలిపారు సుతీర్థో దాస్. పైగా పార్సిల్‌ పైన కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో అని రాసి ఉన్నదని పేర్కోన్నాడు. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు అతను. దీనిపై నెటిజనులు స్పందించారు. తమకు జరిగిన అనుభూతిని ఈ సందర్భంగా కొందరు షేర్ చేసుకున్నారు.